మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా నందమూరి తారకరత్న రామగిరి మండలంలోని వెంకటాపురంలో జనవరి 24న నివాళులు అర్పించారు. వారి ఇంటికి వెళ్లి పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్థార్థతో ముచ్చటించారు. నందమూరి కుటుంబం, పరిటాల కుటుంబం వేరువేరు కాదని ఈ సందర్భంగా తారకరత్న అన్నారు. పరిటాల రవీంద్ర తనకు సోదరసమానుడని అన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా షూటింగ్ కోసం జిల్లాకు వచ్చిన సమయంలో కలిసి భోజనం చేసేవారని అన్నారు. రామగిరి మండలంలో గాలిమరల వద్ద తారకరత్న ‘మగాడు’ సినిమా షూటింగ్‌లో దాదాపు 22 రోజులపాటు పాల్గొన్నారు. వెంకటాపురం నుంచి హిందూపురం వెళుతూ, తన అభిమాని అవుకు హరి ఆహ్వానం మేరకు చెన్నేకొత్తపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి తేనీరు స్వీకరించారు. హరి, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తారకరత్నను శాలువాతో సత్కరించారు. తమ అభిమాన నటుడు లేడని తెలుసుకుని, ఈ ప్రాంతవాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.