నేరేడుచర్ల, ఏప్రిల్ 18 కేకే మీడియా RK
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని శివాజీ నగర్ చెందిన రెడపంగు శోభన్ అనారోగ్యంతో బాధపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం శుక్రవారం లయన్స్ క్లబ్ తరపున రూ.3000 లు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు జీలకర్ర రామస్వామి మాట్లాడుతూ పేదలకు సేవ చేయటంలో లయన్స్ క్లబ్ ముందు వరుసలో ఉంటుందన్నారు. మానవతా దృక్పథంతో సహాయం అందించిన వల్లూరి శ్రీనివాస్, కొణతం సీతారాం రెడ్డి,బట్టు మధులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ చల్లా ప్రభాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ బట్టు మధు, క్లబ్ ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి సైదిరెడ్డి, కోశాధికారి షేక్ యూసుఫ్, లయన్స్ క్లబ్ సభ్యులు పూర్ణచంద్రారెడ్డి, లాయర్ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

