నేరేడుచర్ల, కేకే మీడియా అక్టోబర్ 28
నేరేడుచర్ల పట్టణంలోని రామాపురం రోడ్డు నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరేడుచర్ల, శివాజీ నగర్ కు చెందిన ఇంజమూరి సురేష్ తన ఆటోలో ప్రభుత్వం పంపిణీ చేసిన పిడిఎస్ బియ్యాన్ని తన ఇంట్లో గల పిండి మిల్లులో నూకలుగా మార్చి వాటిని అనంతారం గ్రామము వద్ద ఉన్న కోళ్ల ఫారంలో అమ్మటానికి వెళుతుండగా పట్టుబడి చేసి 16 బస్తాల్లో ఉన్న 8 క్వింటాళ్ల నూకలగా మార్చిన పిడిఎస్ బియ్యాన్ని,ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ నాయక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై చెప్పారు.