కేకే మీడియా సూర్యాపేట నంబర్ 13
24 గంటల విద్యుత్ విషయం లో కాంగ్రెస్ నేతల అబద్దాల పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
కర్ణాటకలో కాంగ్రెస్ 5గంటలే విద్యుత్ ఇస్తుందని మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి వ్యాఖ్యలు చేస్తున్నారు .
కుమార స్వామి వ్యాఖ్యలతో మరో సారి బయటపడ్డ కాంగ్రెస్ పనితనం
కావాలంటే కర్ణాటకలో 18 గంటలు విద్యుత్ వైర్లు పట్టుకుని నిలబడతా తెలంగాణాలో మీరు సిద్ధమా?
ధైర్యం ఉంటే
తెలంగాణాలో కరెంట్ తీగలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఓట్లడగాలి
కరెంట్ తీగలు పట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు నిజాలు తెలుస్తాయి
గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలి
ముందు కరెంట్ తీగలు పట్టుకున్నాకే ఓట్లడగమని డిమాండ్ చేయాలి
బీఆర్ ఎస్ వచ్చాకే గ్రామాలు పచ్చగా మారాయి
కాంగ్రెస్ వస్తే చీకట్లు , కరువు తప్పదు
పోయిన కాంగ్రెస్ ని మళ్ళా రానీయకుండా ఊరి బయట నుండే తరిమేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు
సూర్యాపేట
24 గంటల విద్యుత్ విషయం లో కాంగ్రెస్ నేతల అబద్దాల పై మంత్రి , సూర్యాపేట భీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయి లో ఫైర్ అయ్యారు.
సూర్యాపేటలో ఎన్నికల ప్రచారం సందర్భంగా చివ్వెంల మండలం లో మీడియాతో మాట్లాడిన మంత్రి
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ 5గంటలే విద్యుత్ ఇస్తుందని మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి చేసిన వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ చేతగాని తనానికి నిదర్శనం అన్నారు.కుమార స్వామి వ్యాఖ్యలతో మరో సారి కాంగ్రెస్ పనితనం బయటపడిం దన్నారు.కావాలంటే కర్ణాటకలో 18 గంటలు విద్యుత్ వైర్లు పట్టుకుని నిలబడతా తెలంగాణాలో మీరు సిద్ధమా? అంటూ ప్రశ్నించారు.
ధైర్యం ఉంటే
తెలంగాణాలో కరెంట్ తీగలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఓట్లడగాలి అని సవాల్ విసిరారు.కరెంట్ తీగలు పట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు నిజాలు తెలుస్తాయి అని అన్నారు.గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలన్న మంత్రి జగదీష్ రెడ్డి, ముందు కరెంట్ తీగలు పట్టుకున్నాకే ఓట్లడగమని ప్రజలు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు.బీఆర్ ఎస్ వచ్చాకే గ్రామాలు పచ్చగా మారాయన్న మంత్రి,
కాంగ్రెస్ వస్తే చీకట్లు , కరువు తప్పదు అన్నారుపోయిన కాంగ్రెస్ ని మళ్ళా రానీయకుండా ఊరి బయట నుండే తరిమేయడానికి ప్రజలు సిద్ధపడుతున్నారని అన్నారు.