హుజూర్ నగర్ లో కోర్టు విస్తరణ ఘనత
బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రాంరెడ్డికే దక్కింది
సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద
హుజూర్ నగర్ కేకే మీడియా జూలై 25:
హుజూర్నగర్ న్యాయస్థానాన్నీ 6 కోర్టులుగా విస్తరణకు కృషిచేసిన ఘనత భార్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి దే అనీ సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా హుజూర్నగర్ న్యాయస్థానాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ హుజూర్నగర్ లో ఉన్న నాలుగు కోర్టులలో వసతుల కల్పనతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాద వృత్తిపరంగా ఒత్తిడికి లోనయ్యే సందర్భాలు ఉంటాయని ఒత్తిడిని అధిగమించేందుకు కోర్టు ప్రాంగణంలో మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడల ప్రాంగణాన్నీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం కోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించి రామస్వామి గుట్ట వద్ద నూతనంగా కట్టబోయే కోర్టు ప్రాంగణ ప్రాంతాన్ని అధికారంతో కలిసి పరిశీలించారు.
. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటి సారిగా వచ్చిన సందర్భంగా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన పరిచయ కార్యక్రమం అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి అధ్యక్షత వహించగా న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

