Tuesday, December 9, 2025
HomeDevotionalసత్య సాయి ఉత్సవాలు లో రేవంత్

సత్య సాయి ఉత్సవాలు లో రేవంత్

బాబా మనుషుల్లో దేవుడిని చూశారు…
ప్రేమతో మనుషులను గెలిచాడు…

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం.. అరుదైన అవకాశం

బాబా మనుషుల్లో దేవుడిని చూశారు.. ప్రేమతో మనుషులను గెలిచాడు

తన సేవలతో దేవుడిగా పూజించబడుతున్నారు

ప్రేమతో ఏదైనా సాధించవచ్చని బాబా నిరూపించారు

ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది.. మీ అందరిలో కనిపిస్తోంది

బాబా గారు ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకూ పేదలకు ఉచితంగా విద్యనందించారు

పేదలకు ఉచిత వైద్యం అందించి దేవుడిగా కొలువబడుతున్నారు

గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి చేసి వారి దాహార్తిని తీర్చారు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి

మానవ సేవే మాధవ సేవ అని నమ్మి విద్య, వైద్యంతో పాటు ప్రజలకు మంచినీటి కష్టాలను దూరం చేసి వారి దాహార్తిని తీర్చారు

ప్రపంచంలో కోట్లాది మంది జీవితాలలో బాబా స్ఫూర్తి నింపారు.

ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి.

ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు రావడం ఈ నేల పవిత్రతను తెలియజేస్తోంది

బాబా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది

తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించాం

తెలంగాణ రాష్ట్రంలో బాబా సేవలను విస్తృతం చేసేందుకు మా ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments