[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
నేరేడుచర్ల కేకే మీడియా జూలై 23:
తొలకరి జల్లుల వేళ ఆనందంతో నేలమ్మను పంటగా మార్చే సమయాన ఒక రైతు నారుమడికి యూరియా వేసి నీళ్లు పెట్టేందుకు తన వాగు మోటార్నీ ఆన్ చేసే ప్రయత్నంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరగడంతో విగత జీవిగా పడిపోయాడు.
మండలంలోని పెంచికలదిన్నె గ్రామానికి చెందిన నగిరే శ్రీను (58) వ్యవసాయమే వృత్తిగా శ్రమజీవిగా గుర్తింపు తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటున్న ఆ రైతు కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చింది.
రోజు లాగానే పొలం దగ్గరికి వెళ్లిన శీను నారుమడికి యూరియా చల్లి అనంతరం మోటార్ తో నీరు పెట్టే ప్రయత్నం చేసే క్రమంలో మోటార్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా కరెంటు షాక్ తగలడంతో మోటర్ పైనే పడి విగత జీవిగా మారాడు. అక్కడే దూరంలో ఉన్న కొంతమంది రైతులు గమనించి పోలీసు వారికి సమాచారాన్ని అందించగా హుటాహుటిన అక్కడి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తమలో ఒకడిగా నిత్యం వ్యవసాయ క్షేత్రంలోని కష్టజీవిగా పనులు చేసుకుంటూ ఉండే శ్రీను ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కొన్ని మాసాల క్రితం చిన్న కుమారుడి పెళ్లి జరగగా ప్రమాదవశాత్తు కింద పడి కోమాలోకి వెళ్లి వైద్య సేవలు తీసుకుంటున్న తరుణంలోనే ఇలా ఈ తండ్రికి మృత్యువు వెంటాడడంతో కుటుంబం తో పాటు బంధుమిత్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.

