అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మండల పడిపూజ
నేరేడుచర్ల లోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం నాడు అంగరంగ వైభవంగా మండల పడి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఉదయం వెకుక పూజా కార్యక్రమం తో మొదలయి ఉదయం 6 గంటలకు పాత రామాలయం నుండి కలశాలు తీసుకొచ్చి
ప్రధాన ఆలయంలో వేద పండితులు శ్రీనివాస శాస్త్రి. చే పూజలు ప్రారంభించి హోమం, ప్రత్యేక అభిషేకాలు అనంతరం 18 మెట్ల పడి వెలిగించి
పూజా కార్యక్రమం నిర్వహించారు.ఆట పాటలతో ,భజనల తో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఆలయ చైర్మన్ కొణతం కృష్ణారెడ్డి ,సంధ్య దంపతుల ఆధ్వర్యంలో జరిగిన మండల పడి పూజలో గురు స్వాములు చెన్నుపల్లి శ్రీను,చిట్యాల శ్రీను, ఇల శ్రీను, నాగరాజు ,యారవ సురేష్ ,మాలధారణ అయ్యప్పలు , పుర ప్రముఖులు ,మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

