*త్వరలో భారత్ కు రేబాన్ మెటా గ్లాసెస్*
కృత్రిమమేధ(AI) సాంకేతికతతో పనిచేసే రేబాన్ మెటా గ్లాసెస్ను త్వరలో భారత్లో ప్రవేశ పెడతామని మెటా సంస్థ ప్రకటించింది. ఏదైనా వస్తువును గ్లాసెస్తో చూస్తే, దాని వివరాలను తెలియచేయడమే వీటి ప్రత్యేకత. ఇంటర్నెట్ లేకపోయినా ఇది పనిచేస్తుంది. సంగీతం ప్లే చేయడంతోపాటు, అడిగిన ప్రశ్నలకు జవాబూ ఇస్తుందని కంపెనీ తెలిపింది. వీటిని భారత్, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో త్వరలో ప్రవేశ
పెడతామని వివరించింది.

