సూర్యాపేట కేకే మీడియా
జీవితానికి వెలుతురునిస్తూ భవిష్యత్ కు దారి చూపెట్టేవి గ్రంధాలయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
సూర్యాపేట పట్టణంలోని జిల్లా గ్రంధాలయ కేంద్రంలో నిర్వహించిన గ్రంధాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరయ్యారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి గ్రంధాలయంలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్ లో స్థిర పడాలని ఆకాంక్షించారు.విద్యార్థులు గ్రంధాలయంలో వార్త పత్రికలు, కథల పుస్తకాలు, నావెల్స్ చదివి జ్ఞానాన్ని పెంపొడించుకోవాలని అలాగే ప్రతి రోజు 5 పేజీలు చదివి అలవాటు గా మార్చుకోవాలని కోరారు.
ఆదునాతన సౌకర్యాలతో నూతన భవనం త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
అనంతరం గ్రంధాలయం వారోత్సవాలులో భాగంగా నిర్వహించినవ్యాస రచన, ఉపన్యాసం పోటీ, చిత్ర లేఖనం పోటీలలో ప్రతిభ చుపిన వారికి బహుమతులు అందజేశారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి లక్ష రూపాయల చెక్కును విరాళంగా గ్రంధాలయముకు అందజేశారు.
ఈ కార్యక్రమమునకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, కార్యదర్శి బాలమ్మ,స్థానిక ప్రతి నిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నార

