ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర మంత్రి చౌహాన్ ఇంట్లో నిర్వహించబడుతున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు, మార్చి 19న, ఆయన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్‌తో చర్చించనున్నారు. రేపు సాయంత్రం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకుంటారు. మార్చి 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని, అదే రోజు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారు.

