హైదరాబాద్ కేకే మీడియా
భాగ్యనగరంలో ఆషాడ మాసబోనాలు మహా నగరంలో ఈరోజు కన్నుల పండువగా సాగుతున్నాయి.
సిటీలో గల్లీగల్లీలు ఆధ్యాత్మిక శోభను సంతరించు కున్నాయి.. ఈనెల 7వ తేదీన గోల్కొండ జగ దాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఈ వేడుకలు ప్రారంభమ య్యాయి.
ఇవాళ గోల్కొండ జగదాం బికా అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలు పెద్ద యెత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా గోల్కొండ కోట కింద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.