*ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.*
*”తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2025″ సదస్సు సందర్భంగా ఆయన మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీకి హెలికాప్టర్ లో వచ్చారు.*
ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పాల్గొన్నారు. కాగా, గ్లోబల్ సమ్మిట్‌లో సినిమా రైజింగ్-2047 సెషన్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా పలువురు సినీ నటులు, నిర్మాతలు హాజరయ్యారు. అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, దిల్ రాజు, నటులు రితేష్- జెనీలియా దంపతులు, అక్కినేని అమల, నటుడు రాహుల్ రవీంద్రన్ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.

