హైదరాబాద్,
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం హైదరాబాద్ లో స్వల్ప సమయం పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4.45కి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకోనున్న రాహుల్ రోడ్డు మార్గంలో బోయిన్ పల్లి చేరుకుంటారు. అక్కడ ఐడియాలజీ సెంటర్ లో కులగణనపై జరిగే సమావేశంలో పాల్గొని సమగ్ర అభిప్రాయ సేకరణ చేస్తారు. రాత్రి 7.10 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.