హుజూర్ నగర్ కేకే మీడియా డిసెంబర్ 24
యేసు క్రీస్తు ప్రేమ,కరుణ,శాంతి అనే సుగుణాలను అందించారు..
హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి శానంపూడి సైదిరెడ్డి…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు,హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదర, సోదరీమణులు పండుగలా ఆనందోత్సాహాలతో జరుపు కుంటారని యేసు క్రీస్తు ప్రవచించిన ప్రేమ,కరుణ,శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయని అన్నారు.యేసుక్రీస్తు బోధనలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని, శాంతి సౌభ్రాతృత్వం కరుణ క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని శానంపూడి సైదిరెడ్డిఅన్నారు.రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని ప్రజలందరికీ సుఖశాంతులు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని శానంపూడి సైదిరెడ్డి ఆకాంక్షించారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ యం ఎల్ ఏ శానంపూడి సైదిరెడ్డి. .
RELATED ARTICLES