హుజూర్నగర్ కే కే మీడియా నవంబర్ 27
హుజూర్ నగర్ గడ్డమీద ఎగరబోయేది బిసిల జెండా అని పిల్లుట్ల రఘుకు రాష్ట్ర బీసీ నాయకుల మద్దతు అవసరమని ఎన్నాళ్ళు,ఎన్నేళ్లు దొరల పాలన మన బీసీల రాజ్యం మనకు వద్దా అని జాతీయ బీసీ సంఘంఅధ్యక్షుడు & రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు.సోమవారం హుజూర్ నగర్ పట్టణం ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘుకు రాష్ట్ర బీసీ సంఘాల మద్దతుతో నియోజకవర్గంలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు జాతీయ బీసీ ప్రధాన కార్యదర్శి మండవ శ్రీనివాస్ అధ్యక్షతన వహించి హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీ,ఎస్సీ,ఎస్టీమైనారిటీ వారు హాజరై బీసీ నినాదలతో పట్టణం మార్మోగింది.జాతీయ బిసి అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యకు గజమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నియోజవర్గంలో బీసీ బిడ్డ పిల్లుట్ల రఘు గత మూడు,నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలతో అలుపెరుగని ప్రజాసేవే లక్ష్యంగా నిద్రాహారాలు మాని, ప్రజాసేవకే పాటుపడిన వ్యక్తి రఘు అని సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని. వారిని ఆదరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క బీసీపై ఉందని,మనలో ఐక్యత లేకనే ఇన్ని రోజులు వెనకబడిపోయినామని,ఇకనైనా మన బాగోగులు మార్చుకోవాలంటే మనలో ఒకడు అసెంబ్లీలో ఉండాలని బీసీలు రాజకీయాలకు పనికిరార అని బీసీల్లో ఐక్యత లేదా అని బీసీల్లో విద్యావంతులు లేరా అని బీసీల్లో వ్యాపారస్తులు లేరా అని ఎందుకు మరి మనకు వెనకబాటు తనమని ఆర్. కృష్ణయ్య కార్నర్ మీటింగ్ లో ప్రశ్నించారు.*ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి చీకూరి లీలావతి* మాట్లాడుతూ పిల్లుట్ల రఘు చేస్తున్న సేవలకు వారి అభిమానిగా మారి తన అభిమానులందరినీ సింహం గుర్తుపై ఓటేసి పిల్లుట్ల రఘుని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రతి ఒక్కరికి శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపింది.*ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు* మాట్లాడుతూ తల్లి 9 నెలల తర్వాత బిడ్డకు జన్మనిస్తుందని,అదే 9 క్రమసంఖ్య సింహం గుర్తుతోరావడం ప్రజలకు బానిస పాలన నుండి పునర్జన్మ ఇవ్వడానికి అవకాశం వచ్చిందని హుజూర్ నగర్ నియోజవర్గంలో ఎన్నో సేవలతో ప్రజల ముందుకు వచ్చిన తనకు ప్రజలు ఎమ్మెల్యే గెలుపుతో ఆదరించాలని,తనని ఆదరించకపోతే తన లాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి దొరకడని, అధికారంలో లేకుండా నేను గొప్ప పనులు చేశానని, అధికారంలో ఉంటే మహా గొప్పగా చేస్తానని అన్నారు. తాను స్థానికడుగా నిస్వార్థ సేవకుడిగా పని చేయడానికి వచ్చానని, ప్రజలు బాగోగులు చూసుకొని ప్రజల పక్షాన నిలబడడానికి వచ్చానని. కొంతమంది కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల నాయకులు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి మాటలు నమ్మవద్దన్నారు. ప్రజల సమస్యలు మన గ్రామ సమస్యలు తీర్చడానికి వచ్చిన వ్యక్తినని అన్నారు.ఎన్నాళ్ళు ఈ బానిస పాలన అగ్రకుల వర్ణల వారికేనా పార్టీ టికెట్లు,మనలాంటి సామాన్యులకు లేవా పార్టీ టికెట్లపై ఎందుకు ఇంత పక్షపాతం మన బతుకులు మార్చుకోవాలంటే సింహం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీర్చుదిద్దుకుందా మని, తను ఎమ్మెల్యేగా గెలిచాక ప్రతి ఒక్క ఊరు సమస్యను ప్రజల సమస్యలను తీరుస్తానని అన్నారు. ఇన్ని రోజులు అధికారం ఉన్నామని చెప్పుకునే నాయకులు కనీసం రోడ్ల వసతి తాగునీటి వసతి గాని కల్పించలేక పోయారని,అవినీతి,అక్రమాలు చేసే నాయకులను ఈ నియోజకవర్గం నుండి తరిమేయాలన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి బీసి సంఘాల నాయకులు, మహిళ బీసీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.