- హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 5:
హుజూర్నగర్ సిపిఎం పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కోడలు మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి , సూర్యాపేట జిల్లా సిపిఎం కార్యదర్శి మల్లు నాగార్జున సతీమణి మల్లు లక్ష్మి పేరును దాదాపుగా సిపిఎం రాష్ట్ర కమిటీ ఖరారు చేసినట్లు విశ్వసిన్య సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదట బిఆర్ఎస్ తో, తర్వాత కాంగ్రెస్తో జతకట్టి ఎన్నికల పోటీలో నిలవాలని చూసినప్పటికీ పొత్తులు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న సిపిఎం పార్టీ హుజూర్నగర్ బరిలో ఎవరిని నిలపాలా అన్న ఆలోచనతో ప్రకటించిన అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపినప్పటికీ ఒక హుజూర్నగర్ లో మాత్రం రాష్ట్ర కమిటీ సమాలోచనలు అనంతరం మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి ల పేర్లను పరిశీలించినప్పటికీ చివరికి మల్లు లక్ష్మి పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం