హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 28
హుజూర్నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 2,37,325 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు- 1,16,598, మహిళలు 1,20,70 మంది, ఇతరులు ఏడుగురు ఉన్నారు. వీరు ఓటు హక్కును వినియోగించడానికి నియోజకవర్గంలో మొత్తం 308 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈ ఓటరు జాబి తాలో ఏవైన తప్పులు ఉంటే తాసీల్దార్ కార్యాలయంలో సవరించుకోవచ్చు. సెప్టెంబర్ 28 వరకు సవరణకు అవకాశం ఉంది
తప్పులు సవరణకు సెప్టెంబర్ 19 వరకు అవకాశం
కల్పించారు
అభ్యంతరాలను పరిష్కరించి అక్టోబర్ 4న తుది జాబితాను విడుదల చేస్తారు. కొత్తగా ఓటరు నమో దుకు ఫారం-6, తప్పుల సవరణకు ఫారం-8, అభ్యంతరాలకు ఫారం-7ను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
2023 సంవత్సరం సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషన్ దానికి తగ్గుట్టుగా ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. పోలింగ్ స్టేషన్లు, నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య ముసాయిదా జాబితాను విడుదల చేసింది.
సెప్టెంబర్ 19 వరకు సమీపంలోని వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు వేయవచ్చు వయోభారంతో బాధపడుతున్న వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకోనే అవ కాశం ఉందని ఆర్డీఓ జగదీశెడ్డి అన్నారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి దగ్గర ఓటు వేసే వారు ముందుగా 12డి ఫారం నింపి ఎన్నికల అధికారులకు ఇవ్వాలని, వీడియోగ్రాఫర్ సమక్షంలో ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఎలాంటి అవకతవకలు జరగవని అన్నారు