హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 9
. తెలంగాణ లోఅసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం పదో తారీకు ముగిస్తుండడంతో తొమ్మిదో తారీఖు మంచి రోజుగా భావించి న ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బి ర్ యస్ , ఫార్వర్డ్ బ్లాక్,బి యస్ పి, పార్టీలు ఇతరులు ఇండిపెండెంట్గా మొత్తం 9 మంది నామినేషన్ వేయగా బిఆర్ఎస్ నుండి శానంపూడి సైదిరెడ్డి జన సమీకరణతో నామినేషన్ కు వెళ్లగా, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్య కార్యకర్తలతో నామినేషన్ వేశారు, ఫార్వర్డ్ బ్లాక్ నుండి పిల్లుట్ల రఘు, బీఎస్పీ పార్టీ నుంచి రాపోలు నవీన్ లు తమ అనుచరులతో నామినేషన్లు వేశారు. ఇప్పటివరకు హుజూర్నగర్ అసెంబ్లీ పరిధిలో నామినేషన్ల ఘట్టమొగిసేనాటికి మొత్తం 16 నామినేషన్లు నమోదు అయ్యాయి. నామినేషన్లకు మరొక రోజు గడువు ఉండడంతో ప్రధాన పార్టీలైన బిజెపి, సిపిఎంలు నేడు నామినేషన్లు వేయనున్నట్లు వారితోపాటు మరి కొంతమంది ఇండిపెండెంట్ లు కూడా నామినేషన్లు వేసే అవకాశం ఉంది