హుజూర్నగర్ కేకే మీడియా జులై 30
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉన్నప్పటికీ హుజూర్నగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుండి పోటీ చేసేందుకు కొత్త నాయకులు ఉవ్విళ్లరుతున్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గం లోని నేరేడుచర్ల పట్టణానికి చెందిన తంగేళ్లపల్లి విద్యాసాగర్ ఎన్నారై గా ఉంటూ వ్యాపార రీత్యా హైదరాబాదులో స్థిరపడి గత కొన్ని సంవత్సరాలుగా ఇటీవల మరణించిన తనే తండ్రి పేరుతో హుజూర్నగర్ నియోజకవర్గం లోని తన మిత్ర బృందం ద్వారా విద్య, వైద్య, దేవాలయ కార్యక్రమాల కోసం నిరుపేదలను ఆదుకునే సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హుజూర్నగర్ నియోజకవర్గం లో పోస్టర్ల ద్వారా ఇప్పటికే ప్రచార కార్యక్రమాన్ని మొట్టమొదటి ఎమ్మెల్యేగా పోటీ చేసే బీసీ అభ్యర్థిగా ప్రచారాన్ని మొదలెట్టాడు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పోస్టర్లని వేఇ స్తూ, ఇతర ప్రచార మాధ్యమాల్లో తను నియోజకవర్గ ప్రజల కోసం , నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ప్రణాళికలు ఏంటో తన ఆలోచనలు ఏంటో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. దీంతో వివిధ పార్టీల నుంచి అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికీ గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమం మొదలెట్టిన మొదటి వ్యక్తిగా తంగేళ్లపల్లి విద్యాసాగర్ నిలిచారు
ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారో, ప్రజలు ఏ మేరకు ఆశీర్వదిస్తారో వేచి చూడాలి మరి.