గరిడేపల్లి కేకే మీడియా నవంబర్ 25
హుజూర్నగర్ నియోజకవర్గం కేవలం రెడ్డిల గడ్డ కాదని బీసీల అడ్డా అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో దిగిన పిల్లుట్ల రఘు అన్నారు.
శనివారం రాత్రి గరిడేపల్లి పొనుగోడు చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కేవలం 20 , 30 వేలు ఉన్న రెడ్డి కులస్తులు మాత్రమే ప్రాంతంగా చెప్పుకుంటూ అదే కులం ఆధిపత్యం గా రాజకీయాల్లో కొనసాగుతూ ఉందని, 80 శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అడ్డాని మీ అందరికీ అండగా బహుజన బిడ్డను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నాకే ఓటేయాలని కోరారు.
ఐదు సార్లు గెలిచిన ఉత్తం ఎంతమందికి వ్యక్తిగతంగా సహాయం చేశాడని, ఎంతమంది బాధల్లో ఉంటే వచ్చే ఆదుకున్నాడని అతడు అన్ని ఇచ్చే బాబా అవతారం కాదని అన్నారు . కాంగ్రెస్ నాయకులు నన్ను 3 కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారని , ఎమ్మెల్సీ ఆశతో ఒక పార్టీకి అమ్ముడు పోయే స్థితిలో నేను లేనని అలా అనేవారికి మూడు కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధం నేనే వారికి ఎమ్మెల్సీ ఇస్తా మా దగ్గరికి రావాలని ఉన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయవద్దని ఘాటుగా సమాధానం ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల ఓట్లతోనే రెడ్డిలైన సైదిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు గెలిచారని, గెలిచి వేల ఎకరాలు దోచుకుని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ పెట్టి ఫ్యాక్టరీలలో దోచుకుంటున్నారని మన ఓట్లతో గద్దెనెక్కి మనల్ని అణచివేస్తున్నారని మరోసారి మోసపోయి వాళ్లకు ఓటేస్తే మన జీవితాలు నాశనం చేసుకున్నట్టే అన్నారు. బీసీ బిడ్డగా నన్ను గెలిపిస్తే మన సమస్యలన్నీ తెలిసినవాడిగా అర్హత గల ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్ని అందేలా చూస్తానని అన్నారు
మూడేళ్లుగా ఎన్నికల తోడు సంబంధం లేకుండా లక్షలాదిమందికి అన్నదాన కార్యక్రమాలు, ఉచిత కోచింగ్ సెంటర్ లో విద్యార్థులకు కోచింగ్ చెప్పించి ఉద్యోగాలు వచ్చేలా చూసానని, గుడి ,బడి సహాయం కోసం ఎవరు వచ్చినా నా వంతు సహాయం అందించాలని, ఆపదలో ఉన్న కుటుంబాలకి ఆదుకుంటూ వస్తున్నానని ఇవన్నీ చేశాను కాబట్టి ఓట్లు అడగటం లేదని ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే మీ బిడ్డగా సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని కోరుతున్నా అన్నారు.
మందుకో, చికెన్ కో, నోటుకో మోసపోతే మనల్ని మనం మోసగించుకున్నట్లే అన్నారు.
నిస్వార్ధంగా సేవ చేసే నాలాంటి ఎమ్మెల్యే కావాలా అవినీతి డబ్బు పంచిపెట్టి మనపై పెత్తనం చేసే ఎమ్మెల్యే కావాలా ఆలోచించి ఓటు వేయాలన్నారు.