Wednesday, December 11, 2024
HomeTelanganaహుజూర్నగర్ పీఠం ఎవరిది ?

హుజూర్నగర్ పీఠం ఎవరిది ?

హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 2
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం కు ఒక ప్రత్యేక స్థానం హుజూర్నగర్ బరిలో నిలిచిన మాజీ మంత్రి మాజీ టీపీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎంపీ వరుసగా హుజూర్నగర్ కొత్త నియోజకవర్గం అయిన తర్వాత మూడు పర్యాయాలు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరిగిన నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి ఒకవైపు ., ఉత్తం ఎంపీగా వెళ్లే సమయంలో అనివార్యంగా వచ్చిన ఉప ఎన్నిక ల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఒకవైపు నువ్వా నేనా అన్నట్లు జరిగిన పోటీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది
.
గెలుపు పై ధీమాలో కాంగ్రెస్:::

హుజూర్నగర్ కాంగ్రెస్కు అడ్డ అని మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా మంచి విజయాన్ని అందించిన హుజూర్నగర్ నియోజకవర్గం మరో మారు నన్ను భారీ మెజారిటీతో గెలిపించబోతుందని ఉత్తం పదేపదే చెబుతున్నప్పటికీ దేశస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పదవులు ఉండడం నియోజకవర్గానికి సరైన సమయం ఇవ్వకపోవడం అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహించకపోవడం , , బూత్ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోకపోవడం, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కొత్తగా వచ్చిన నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు లభించడం లేదన్న కోపంలో ఉండడం, కాంగ్రెస్లో ఉండి టిఆర్ఎస్ అభ్యర్థితో కొందరు నేతలు టచ్ లో ఉండడం ఓటు పై ప్రభావం పడినప్పటికీ , గతంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి జాతీయ స్థాయిలో ఉన్న పలుకుబడి అసెంబ్లీ అభ్యర్థిగా గెలిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే మంచి స్థానంలో ఉంటాడన్న నమ్మకానికి తోడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలంగా వీస్తున్న గాలులకు తోడు స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విభేదించి పార్టీ మారిన కొందరు నాయకుల కసి పట్టుదల కృషితో చేసిన ప్రయత్నాలు విజయాన్ని చేకూర్చే అంశంగా చెప్పవచ్చు

మళ్లీ నాదే గెలుపు అంటున్న శానంపూడి.::

అత్యధిక మెజారిటీతో ఉప ఎన్నికల్లో గెలిపించిన నాకు హుజూర్నగర్ నియోజకవర్గంలో 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగువేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశానని ప్రతి గ్రామం కలియతిరిగి వ్యక్తిగతంగా నాయకత్వాన్ని ప్రజలను గుర్తించి వారిని పేర్లతో పిలిచి వారి మంచి చెడు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని గ్రామాల అభివృద్ధికి దోహదపడ్డ నన్ను మళ్లీ హుజూర్నగర్ ప్రజలు గెలిపిస్తారన్న విశ్వాసాన్ని వెలుబుచ్చుతున్నప్పటికీ , గెలిచినప్పటినుంచి గెలుపుకు దోహదపడ్డ నాయకులను పట్టించుకోలేదని . ఆరోపిస్తూ చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న నాయకులు కొందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినప్పటికీ మిగిలిన వారిని సమన్వయంతో గ్రామస్థాయిలో బూత్ లెవెల్ వరకు పటిష్టమైన కమిటీలను ఏర్పాటు చేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ మీద ప్రజలకు, లబ్ధిదారులకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని పదేపదే గుర్తు చేస్తూ తన ప్రయత్నంతో చేసిన అభివృద్ధిని తెలియజేస్తూ ప్రతి గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించి ఢిల్లీలో ఉండే నాయకుడు కావాలా మీ ముందు నిత్యం కనపడే ప్రజా నాయకుడు కావాలా అంటూ తనదైన రీతిలో ప్రచారం నిర్వహించి ప్రజలకు చేరువై ఇక గెలుపు కచ్చితంగా నాదే అని బలంగా చెబుతున్నప్పటికీ. పార్టీ నుంచి బయటకు వెళ్లిన కొందరు నేతలు ప్రెస్టేజ్ గా తీసుకుని ఓటమికి ప్రయత్నం చేయటం, పది సంవత్సరాల అధికార పార్టీ మార్పు కోరుకునే ప్రజల అభిప్రాయం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతని దగ్గర బంధువులు చేసిన ప్రజలకు ఇబ్బంది పడే పనులు ఆయా మండలాల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి ఉండడంతోపాటు అదే ఆరోపణలలో ఎమ్మెల్యే వెనుక ఉండి నడిపిస్తున్నాడన్న ప్రతిపక్షాల ప్రచారం ప్రజల్లో బలంగా వెళ్లడం, వాటన్నింటినీ తిప్పి కొట్టి చేసిన అభివృద్ధి నిత్యం ప్రజల్లో ఉండే మనిషిగా గుర్తించి నన్ను గెలిపిస్తారన్న నమ్మకం ఆ నాయకుడిలో, కార్యకర్తలు బలంగా ఉంది.

నేను చేసిన సేవలే నన్ను గెలిపిస్తాయి:: పిల్లుట్ల

గత మూడేళ్లుగా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాల్లో ముందుండి ఎన్నికల్లో నిలబడితే గెలిపిస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని చెప్పుతో వచ్చి ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా ఆశించి రాకపోవడంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా బరిలో నిలిచి నేను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలు కచ్చితంగా గుర్తుంచుకొని నా విజయానికి దోహద పడతారని, ఇది రెడ్డిల రాజ్యం కాదని బీసీలందరూ ఐక్యతతో నాకు సపోర్టుగా నిలిచి ఓటు బ్యాంకుగా నిలుస్తారని నమ్మకం ఉందని పిల్లుట్ల రఘు చెబుతున్నప్పటికీ సేవ చేసినంత సేపు బాగానే ఉంటుంది కానీ ఓట్లు వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా వస్తున్న ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు ఎన్ని వేస్తారో వేచి చూడాలి. కొన్ని గ్రామాల్లో నిజమైన అభిమానులు అభిమానం చూపిస్తున్నప్పటికీ గెలిచేంత బలం రాకున్నా గణనీయమైన ఓటు బ్యాంకు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీల ఓటమిలో భాగస్వామి కానుంది అనేది సమాచారం

కమ్యూనిస్టులకు పూర్వవైభవం ఖాయం

టిఆర్ఎస్ ,కాంగ్రెస్ ఏదో ఒక పార్టీ పొత్తు ఉంటుందిలే అని కలలుకని పొత్తు వికటించి సొంతంగా బరిలో దిగిన సిపిఎం మల్లు లక్ష్మిని బరిలో దింపినప్పటికీ స్థానిక  స్థానిక నాయకురాలు కాకపోవటం, పార్టీ బలహీనతలతో చాలామంది పార్టీని వీడి పక్క పార్టీలోకి వెళ్లిపోవడం, అందరి మాదిరిగానే పైకి జెండా పట్టుకున్న లోపల ప్రలోభాల ఎజెండా ఉన్న కార్యకర్తలు ఉండడం , పరువు నిలుపుకునేందుకు చేసిన ప్రయత్నం వృధా కాకుండా ఉంటుందని అనుకుంటున్నప్పటికీ గతాన్ని మించి ఓటు బ్యాంకు రాకపోవచ్చు అనేది అంచనా…

బహుజనులే నా బలం.. బి ఎస్.పి

బహుజనులే నా బలం    వారే నాకు  అండగా ఉంటారంటూ బరిలోకి దిగిన రాపోలు నవీన్ తనకున్న పరిచయాలు సంబంధాలు తో బరిలోకి దిగి శాయ శక్తుల కృషి చేసినప్పటికీ డబ్బు అధికార బలం ముందు కొంత వెనుకబడినా స్నేహితులు, సన్నిహితులు, బంధువు లు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అభిమానించే అభిమానుల ఓట్లు ఆశించిన మేర పడతాయనే భావన.

డబల్ ఇంజన్ ప్రభుత్వమే గెలిపిస్తుందని నమ్మతున్న బిజెపి….

జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో బాగా వేయాలని చూసిన బిజెపి బండి సంజయ్ అధ్యక్ష స్థానం నుంచి మార్పు అనంతరం మునుగోడు ఉప ఎన్నికల్లో పరాభవంతో వెనుకడుగులు వేస్తున్న బిజెపి హుజూర్నగర్ బరిలో బిఆర్ఎస్ అసంతృప్తినేత చల్లా శ్రీలత రెడ్డికి టికెట్ ఇచ్చినప్పటికీ అధిష్టానం ఆశించిన మేర పనితనం చూపకపోవడంతో పార్టీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఒక్కరోక్కరు గా పార్టీని వీడినప్పటికీ ప్రచారం చేసే ప్రయత్నం చేసిన ఆశించిన మేర కార్యకర్తల నాయకులను ప్రభావితం చేసే విషయంలో వెనుకడుగు వేసినట్లుగా చుట్టూ ఉన్న కొంతమంది పార్టీని నమ్ముకున్న నాయకులు గౌరవప్రద ఓట్ల కోసం ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డి పై పోటీ చేసి ఘనమైన ఓట్లు చీలుస్తారని అందరూ ఊహించిన గతాన్ని మించి ఓట్లు రాకపోవచ్చు అని అంచనాలో అభిమానులు ఉన్నట్లు సమాచారం

లెక్కింపుకు మరి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఎవరి ఊహగానాలు వారివే ఎవరి గెలుపోటముల బెరీజు వారు వేసుకుంటున్న ఎవరి ఓట్లు గణనీయత ఊహలలో ఉన్నప్పటికి ఓటర్లు వేసిన ఓట్లు స్పష్టం ..మరో 24 గంటల్లో పూర్తి సమాచారం వెలవడనుంది. హుజూర్నగర్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరు గెలిచినా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో మాత్రం హుజూర్నగర్  స్థానం పదిలం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments