హుజూర్నగర్ కే కే మీడియా జూలై31:
హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలే నా బలగం నేను మీ వాడిని మీకోసమే వచ్చా హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించిన అంటూ గ్రామ గ్రామాన పోస్టర్లతో ప్రచారాన్ని ఉదృతం చేశారు.
ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు చేరువైన పిల్లుట్ల రఘు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రతి గ్రామంలో వాల్ పోస్టర్లను అంటిస్తూ అధికారికంగా తను రానున్న ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు.
ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు స్పష్టత లేనప్పటికీ ప్రధాన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతానని తన అనుచరులకు అభిమానులకు సంకేతం అందిస్తున్నాడు.
రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పార్టీ నుంచి పోటీ చేస్తారు లేక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడతారో ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారో వేచి చూడాలి మరి.