హుజూర్నగర్ కేకే మీడియా సెప్టెంబర్ 14
హుజూర్నగర్ జిల్లా సాధనే నా లక్ష్యమని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి అన్నారు.
మంగళవారం నాడు హుజూర్నగర్ కోర్టులో అదనపు జిల్లా కోర్టు ప్రారంభోత్సవం జరిగిన అనంతరం ఏర్పాటు చేసిన సభ లో హుజూర్నగర్ చిరకాల కల జిల్లా కోర్టు తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని అంటూ హుజూర్నగర్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది అన్ని అర్హతలు ఉన్న హుజూర్నగర్ జిల్లాగా ఏర్పాటు చేయించడమే తన కోరిక అని జిల్లాగా ఏర్పాటు కోసం ఇప్పటినుండి తన ప్రయత్నం ప్రారంభమవుతుందని తన మనసులో మాట తెలిపారు.
మొట్టమొదట నియోజకవర్గాల ఏర్పాటులో హుజూర్నగర్ అసెంబ్లీగా ఉండేదని తర్వాత కొంతకాలం మిర్యాలగూడ లో కలిపినప్పటికీ పునర్విభజనలో మళ్లీ హుజూర్నగర్ అసెంబ్లీ స్థానం ఏర్పడిందని ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యంతోపాటు ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ప్రజా ప్రతినిధులుగా సేవలందించారని కృష్ణా పరివాహక ప్రాంతంలో సిమెంటు కర్మాగారాలతో, పాటు వరి పండించడంలో బియ్యం ఎగుమతుల్లో మన స్థానం రాష్ట్రంలో ప్రత్యేకమని అన్ని పార్టీలు అన్ని వర్గాల ప్రజలు అన్ని సంఘాలు ఏకమై పట్టుదలతో ప్రయత్నం చేస్తే హుజూర్నగర్ జిల్లా చేయడం పెద్ద కష్టమైన పని కాదని అన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గ చరిత్ర కంటే అతి తక్కువ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల జిల్లాలుగా మారాయని ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన హుజూర్నగర్ అన్ని వనరులు ఉన్నందున జిల్లా సాధన కోసం తను ముందడుగు వేయడానికి సిద్ధమని అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు