హుజూర్నగర్ కేకే మీడియా సెప్టెంబర్ 12
హుజూర్నగర్ కోర్టుకు జిల్లా అదనపు కోర్టు విభాగం రావడం హుజూర్ నగర్ కే తలమానికమని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుంత రాజగోపాల్ అన్నారు. మంగళవారం హుజూర్నగర్ కోర్టు ఆవరణలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధి చే వర్చువల్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో జిల్లా న్యాయస్థానం సూర్యాపేట ఉండగా అదనపు జిల్లా న్యాయస్థానం హుజూర్నగర్ కు రావడం ఎంతో ఆనందదాయకమని ఈ ప్రాంత కక్షిదారులందరకి ఎంతో ఉపయోగకరమని అన్నారు. నేను జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ప్రారంభోత్సవం చేయడం నాకెందు ఆనందం కలిగించింది అన్నారు. ఇటీవల జరిగిన లోక్ అదాలత్ లో సూర్యాపేట జిల్లావ్యాప్తంగా 18 కేసులు లో కథాల ద్వారా పరిష్కారం అవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అందరి సహాయ సహకారాలు ఇలాగే కొనసాగితే జిల్లాలో కేసులు సత్వర పరిష్కారం సాధ్యం అవుతుందని ప్రజలు కోరుకున్న న్యాయం జరిగేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాజేందర్ లు వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి వెళ్లగా కార్యక్రమంలో హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి శ్యామ్ కుమార్ జూనియర్ సివిల్ జడ్జ్ మారుతి ప్రసాద్ లతోపాటు హుజూర్నగర్ బార్ అసోసియేషన్ సభ్యులతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నలుమూలల నుండి బార్ అసోసియేషన్ సభ్యులు ఇతర ప్రముఖులతోపాటు వివిధ ప్రాంతాల న్యాయమూర్తులు, ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు