హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 5
*అభివృద్ధికి ఆకర్షితులై, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న చేరికలు*
*బీజేపీ పార్టీ హుజూర్నగర్ టౌన్ అధ్యక్షులు ముసుకుల రామచంద్రారెడ్డి, మరియు బీజేపీ జిల్లా నాయకులు, పట్టణ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరిక.*
*హుజూర్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో*
*హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారు మరియు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గట్టు శ్రీకాంత్ రెడ్డి ల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
_బీజేపీ పార్టీకి రాజీనామా చేసి,బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ముఖ్యులు: బీజేపీ పార్టీ హుజూర్నగర్ టౌన్ అధ్యక్షులు ముసుకుల రామచంద్రారెడ్డి,బీజేపీ జిల్లా కార్యదర్శి అన్నేపంగు అబ్బాస్ -మేళ్లచెరువు, గంధం సతీష్ బిజెపి అసెంబ్లీ సోషల్ మీడియా కన్వీనర్, బీజేపీ జిల్లా నాయకులు,చిత్తలూరి సోమయ్య -గరిడేపల్లి ,మంద వెంకటేశ్వర్లు, ముసంగి శ్రీను, పులి నరసింహ, షేక్ బాబు – పాలకీడు, ఊట్ల నాగేశ్వరరావు పాలకీడు, గోపు విజయ -మేళ్లచెరువు మల్లేశ్వరమ్మ పిల్లి మరియా దాస్, అయిల దానమూర్తి, గుండు శీను తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించడం జరిగింది. పార్టీలో చేరిన ప్రతి నాయకులు, కార్యకర్తలకు, పార్టీ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటామని తెలిపారు. పాత కొత్త అని తేడా లేకుండా అందరూ సమన్వయం తో కలిసి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు.
పార్టీలో చేరిన వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రతి ఒక్కరికీ చిన్న పెద్ద అని తేడా లేకుండా, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే నాయకులు హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, హుజుర్ నగర్ అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరిని కాపాడుకుంటున్న నాయకులు ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. అందరిని నవ్వుతూ పలకరిస్తారని, ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకొని పేరు పెట్టి పిలుస్తారని,వారికి మా సంపూర్ణ మద్దతు తెలుపుతూ, అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది అన్నారు.