సూర్యాపేట కేకే మీడియా నవంబర్ 23
ప్రముఖ హీరో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో హుజూర్నగర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి చల్ల శ్రీలత రెడ్డి ఒకే వేదికపై కలసి దిగిన ఫోటో హుజూర్నగర్ నియోజకవర్గంలో హల్ చల్ చేస్తోంది.
గురువారం నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన పవన్ కళ్యాణ్ రోడ్ షో లో హుజూర్నగర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి చెల్లా శ్రీలత రెడ్డి గెలిపించేందుకు జనసేన బిజెపి ఎన్నికల పొత్తులో భాగంగా
బిజెపి గెలుపు కోసం జనసేన కార్యకర్తలందరూ హుజూర్నగర్ నియోజకవర్గంలో మద్దతు ప్రకటించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ శ్రీలతను పరిచయం చేసిన క్రమం హాట్ టాపిక్ గా మారింది.
మొదట జనసేన పార్టీ నుండి హుజూర్నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రకటన చేసినప్పటికీ ఇరు పార్టీల పొత్తులో భాగంగా హుజూర్నగర్ టికెట్ను బిజెపికి కేటాయించడంతో ఇరు పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించేందుకు పవన్ కళ్యాణ్ రోడ్ షో జరుపగా ఆ వేదికపై శ్రీలతను పరిచయం చేస్తూ పవన్ మద్దతు తెలిపారు. బిజెపి శ్రేణులకు తోడు హుజూర్నగర్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన సైనికులు మద్దతు తెలిపితే గౌరవప్రదమైన ఓట్లతో నువ్వా నేనా అన్న స్థానంలో ఉండబోతున్నట్లు బిజెపి అభ్యర్థి చల్లా శ్రీలత తెలిపారు.