నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 3
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకత్వంపై రాళ్ల దాడి చేయటం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు
సోమవారం నాడు ఆయన నేరేడు చర్ల లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమై అల్లాడుతుంటే ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు చోద్యం చూశారే తప్ప కనీసం పరిశీలనకు పోలేకపోయారని, ప్రతి జిల్లాకు ఒక ముఖ్య మంత్రి ఉన్నారని ప్రత్యేకించి ఖమ్మం జిల్లాకుముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారని, అయినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోలేని,,సహాయం చేయని స్థితిలో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం కాంగ్రెస్ వారి వెకిలి తనానికి నిదర్శనం అని, బిఆర్ఎస్ నాయకులపై దాడి చేస్తే ప్రజలకు ఏమైనా న్యాయం జరుగుతుందా…. అని… ప్రజలకు న్యాయం చేయడం చేతకాని వాళ్లు మాత్రమే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతారని…. ఎన్నికల సందర్భంగా ఎన్నో బూటకపువాగ్దానాలు చేసి ప్రజలకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా తలలో నాలుకలా ఉంటామని అన్ని విధాల ఆదుకుంటామని వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకొని తమ నాయకుల పుట్టినరోజులకు హెలికాప్టర్లో వెళ్లిన వారికి ఇవాళ ప్రజలు నానా అవస్థలు పడుతుంటే హెలికాప్టర్ దొరకడం లేదా అని ప్రశ్నించారు
భౌతిక దాడులకు బిఆర్ఎస్ పార్టీ బెదర బోదని… చావుకు సిద్ధపడి మా నాయకుడు ఉద్యమించాడని ఆ నాయకుడు నాయకత్వంలో ప్రజలకు నిరంతరం అండగా ఉంటామని, కాంగ్రెస్ పార్టీ మాయ మాటలకు లొంగీ 1.75% ప్రజలు చేసిన చిన్న పొరపాటు వల్ల ప్రజలు ఈరోజు తలలు పట్టుకుని కూర్చున్నారని భవిష్యత్తు బిఆర్ ఎస్ పార్టీదే
దని ఆయన ధీమా వ్యక్తం చేశారు