మిర్యాలగూడ కేకే మీడియా ఆగస్టు 26
హరితహారం ఒక మహోన్నత కార్యక్రమమని ఇది నిరంతరాయంగా గత ఎనిమిదేండ్లుగా కొనసాగుతోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర రావు అన్నారు. శనివారం నాడు మిర్యాలగూడలో స్వతంత్ర భారత వజ్రోత్సవలు ముగింపు సందర్భంగా. చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మకాలనీ (వార్డు-6) నందు ఏర్పాటు చేసిన హరితహార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హరితహారం అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది అని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రత్యేక దృష్టితో తెలంగాణలో అటవీ శాతం, పచ్చదనం ఘనంగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చని రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ఎంతో గొప్పగా అభివృద్ధిని సాధించింది, అని అన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఎదగడం గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ సాదినేని స్రవంతి శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు, పలు విభాగాల వార్డ్ అద్యక్షులు, మహిళలు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు