Monday, January 13, 2025
HomeTelanganaస్వయం పాలనతో భవిష్యత్తుపై అవగాహన

స్వయం పాలనతో భవిష్యత్తుపై అవగాహన

నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 14
విద్యార్థులకు స్వీయ అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు అంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అలక సైదిరెడ్డి డైరెక్టర్ సుంకర క్రాంతికుమార్ లు అన్నారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు ఒక్కరోజు పాలనలో విద్యార్థులు నాయకులుగా ప్రజాప్రతినిధులుగా అధికారులుగా ఉపాధ్యాయులుగా తమ పాత్రలపై పూర్తిస్థాయిలో స్వయం పాలనతో భవిష్యత్తుపై అవగాహన పెంచుకున్నారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని వారు ఆకాంక్షించారు . ఈ స్వ పరిపాలన దినోత్సవం లో సీఎంగా జి .జస్వంత్ శాఖ మంత్రిగా ఎస్. సింధు విద్యాశాఖ మంత్రిగా జి. హైందవి విద్యుత్ శాఖ మంత్రిగా సిహెచ్. రామ్ చరణ్ ఎంపీగా పి. వంశీ ఎమ్మెల్యేలుగా వి. సుమంత్ కే. సిరి మోక్షజ్ఞ ఎమ్మెల్సీగా సాయి జడ్పీ చైర్మన్ గా లిఖిత కలెక్టర్ గా బెనజీర్ జాయింట్ కలెక్టర్ గా పూజిత ఆర్డీవో గా షబానా మున్సిపల్ చైర్మన్ గా సంజయ్ జడ్పిటిసి గా పవన్ లు వ్యవహరించారు అనంతరం స్వపరిపాలన దినోత్సవం లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments