బాధ్యత గల పౌరులుగా నడుచుకుందాం
……. హుజూర్నగర్ జిల్లా అదనపు జడ్జి డా.. శ్యాం శ్రీ
హుజూర్నగర్ కేకే మీడియా ఆగస్టు 15:
బాధ్యతగల పౌరులుగా భారత స్వాతంత్రమును కాపాడుకుందామని హుజూర్నగర్ జిల్లా అదనపు న్యాయమూర్తి డా.. శ్యాం శ్రీ అన్నారు.
గురువారం హుజూర్నగర్ కోర్టు ఆవరణలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించిన చరిత్ర మరువక ముందే భారతదేశానికి చుట్టూ ఉన్న దేశాల నుంచి ప్రమాదం పొంచి ఉందని సాధించిన స్వాతంత్రాన్ని త్యాగదనుల ఆశయాలను కాపాడడానికి భారతీయ పౌరులుగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భారత స్వాతంత్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జాతి, కుల, మత భేదాభిప్రాయం లేకుండా మనమందరం భారతీయులం అనే భావనతో కలిసిమెలిసి మెలిగి భారతదేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకుపోవాలని సూచించారు.
హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాముల రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీనియర్ సివిల్ జడ్జ్ జిట్ట శ్యాం కుమార్, ప్రభుత్వాదనపు న్యాయవాదులు నెట్టే సత్యనారాయణ, బానోతు సురేష్, జీవీకే మూర్తి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జక్కుల వీరయ్య , న్యాయవాదులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన
ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు చేశారు.