హుజూర్నగర్ కేకే మీడియా ఫిబ్రవరి 21:
ఓజో ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ పేరుతో హుజూర్నగర్ నియోజకవర్గమ్ మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన పిల్లుట్ల రఘు నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల్లో తమ తమ అభిమానులతో స్వచ్ఛంద సేవ కార్యకర్తలతో పలు కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ దూసుకుపోతున్నాడు.
ఏ గ్రామం నుంచి సహాయం కావాలని వెళ్ళిన వారి వారి గ్రామాల్లోని బడులకు గుడులకు భారీ మొత్తంలో విరాళాలు అందజేస్తూ ఆపదలో ఉన్న వారికి నేనున్నానని అభయమిస్తూ వరుస సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్నాడు. రాజకీయ నేపథ్య కుటుంబం కానప్పటికీ బీసీ సామాజిక వర్గం నుంచి హుజూర్నగర్ నియోజకవర్గంలో భవిష్యత్తులో రాజకీయ ఆరంజేయడం చేసి ఏదో ఒక ప్రధాన పార్టీ నుంచి శాసనసభ్యునిగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రజలతో మమేకమై ప్రజాసేవలో ముందుకు పోతూ ఉన్నానని పలు ఉపన్యాసాలలో పదేపదే చెబుతూ వచ్చారు. కొన్ని సమయాల్లో రాజకీయ ఒత్తిళ్లు అనివార్యమైనప్పటికీ సేవే లక్ష్యం ప్రేమిమార్గం సేవతోనే ప్రజలకి చేరువైతా వారి మనసు గెలుచుకొని రాజకీయాల్లో వారి ఆశీర్వాదమ్ పొందుతానని బలంగా చెబుతున్నాడు. హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో తనకంటూ ఒక ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలలోకి వెళుతున్నప్పటికీ తనకు అండగా నిలవాలనుకున్నవారు ఫోన్లలో సంప్రదిస్తున్నారే తప్ప ప్రత్యక్షంగా తనతో నడిచే నాయకత్వ లోపం ఉన్నప్పటికీ సొంత కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు వందలాది మందికి సొంత ఖర్చులతో హైదరాబాదులో ట్రైనింగ్ ఇప్పించడం తో యువత మదిలో నిలిచిపోయారు. పలు దైవ కార్యక్రమాలలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ చిన్న గుండ్లు మొదలు మొన్నటి జాన్ పహాడ్ ఉర్సు తోపాటు నిన్నటి మేళ్లచెరువు జాతర వరకు వేలాది మందికి భారీ అన్నదాన కార్యక్రమాలు చేసి భక్తుల మదిలో నిలిచిపోయారు.
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు అన్న ప్రశ్నలు ప్రజలలో ఉన్నప్పటికీ ఏదో ఒక ప్రధాన పార్టీ నుంచి అని చెప్పకనే చెబుతున్న ఇద్దరు బలమైన ప్రధాన పార్టీల నాయకులు ఉండగా ఆయా పార్టీలలో అవకాశం కోసం చేసే ప్రయత్నం తాను చేసే సేవా కార్యక్రమాలు రాజకీయం వైపు ఆశీర్వచనాలుగా మారుతాయా ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.