Sunday, May 18, 2025
HomeEntertainmentస్పెషల్ సాంగ్ లో నయన్

స్పెషల్ సాంగ్ లో నయన్

రాజాసాబ్ స్పెషల్‌ సాంగ్‌‌లో నయన్

గ్లోబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘రాజాసాబ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌ కథానాయికలు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీంట్లో ఓ ప్రత్యేక గీతం ఉండనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే . ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి నయనతార ఆడిపాడనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో సంప్రదింపులు పూర్తయినట్లు తెలిసింది. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెలలో పాటను చిత్రీకరించే అవకాశముంది. ప్రభాస్‌ – నయన్‌ చివరిగా 2007లో వచ్చిన ‘యోగి’లో జంటగా నటించారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ ‘రాజాసాబ్‌’తో తిరిగి కలవనున్నారు. వినోదం నిండిన హారర్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ చిత్ర తొలి గీతం సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments