సూర్యపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా న్యూస్ ఫిబ్రవరి 23
నేరేడుచర్ల మండలం సోమారం గ్రామంలో గల బృగుమాలిక సోమేశ్వర దేవస్థానం నందు మహాశివరాత్రి కి కొబ్బరికాయలు అమ్ముకోవడానికి శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించగా 45 మంది హాజరు కాగా నలుగురు డిపాజిట్ కట్టి వేలంపాట లో పాల్గొన్నారు. కొబ్బరికాయలు అమ్ముకొనుటకు పళ్ళ నాగేశ్వరరావు 98 వేల రూపాయలకు పాట పాడి
వేలం దక్కించుకున్నాడు. గత సంవత్సరము కంటే 13000 రూపాయలు పెరిగాయి. వేలంపాట పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ, లోడంగి లక్ష్మయ్య, పెండెం సైదులు సోములు, నాగుల శ్రీనివాస్ శర్మ,వెంకట్రావు, చంద్రయ్య, ఆలయ అధికారి కొంకపాక మృత్యుంజయ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.