- నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 13
సెప్టెంబర్ 17న హైదరాబాదులో జరిగే మీటింగ్ కు ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని నేరేడుచర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి పిలుపునిచ్చారు
బుధవారం మండల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసి రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ రాబోతోందని ప్రతి కార్యకర్త హుజూర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపుతో పాటు అత్యధిక మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని కోరారు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండలంలో బూతుల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఏజెంట్ ను నియమించాలని సూచించారు.
ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
17వ తారీఖున జరిగే సోనియా గాంధీ భారీ బహిరంగ సభకు నేరేడుచర్ల మండల కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ ముఖ్య కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘాల నాయకులు మహిళా కమిటీలు యూత్ కమిటీలు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ప్రజలను హైదరాబాదులో జరిగే సోనియాగాంధీ మీటింగ్ కు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసి మన సత్తా చాటాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.