ఖమ్మం కేకే మీడియా సెప్టెంబర్
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం దాదాపు ఖరారైంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆయన చేరనున్నట్లు తెలిసింది. గురువారం నుంచి రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్తుండటంతో తుమ్మల ఈ నెల 6న కాంగ్రెస్ లో చేరేలా ముఖ్యనేతలు ప్రణాళికలు రచించినట్లు సమాచారం. తుమ్మలతో పాటు ఆయన ముఖ్య అనుచరులు దిల్లీ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బిఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న పలువురు జిల్లా నేతలు తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఇలాంటి వారంతా ఆయనతో పాటే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. తుమ్మల చేరికతో ఖమ్మం జిల్లా తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం పడనుంది.