హుజూర్నగర్ కేకే మీడియా సెప్టెంబర్ 5
హుజూర్నగర్ కోర్టు సముదాయంలో సెప్టెంబర్ 12న అదనపు జిల్లా న్యాయస్థాన విభాగాన్ని ప్రారంభించనున్నట్లు హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు టీటీడీ పాలక మండలి సభ్యులు సాముల రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
1922లో హుజూర్నగర్ లో ప్రారంభించబడిన మునిసిఫ్ కోర్టు, 2014 లో సబ్ కోర్టు ప్రారంభోత్సవం కాగా ఏప్రిల్ 2014న నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. సెప్టెంబర్ 12న ఉదయం 10 గంటలకు జరగబోయే అదనపు జిల్లా కోర్టు ప్రారంభోత్సవంతో హుజూర్నగర్ కోర్టుకు అదనపు జిల్లా కోర్టు హోదా దక్కనుంది
ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నప్పుడు ఈ ప్రాంత కక్షిదారులు మిర్యాలగూడలో ఉన్న అదనపు జిల్లా న్యాయస్థానానికి వెళ్లవలసి వచ్చేది జిల్లాల విభజన అనంతరం సూర్యాపేట జిల్లా న్యాయస్థానానికి వెళ్లే కక్షిదారులకు హుజూర్నగర్ లో ఏర్పాటు కాబోయే జిల్లా అదనపు న్యాయస్థానంలో న్యాయవాదులకు, కక్షిదారులకు సౌకర్యం కలగనుంది
హుజూర్నగర్ కోర్టు అభివృద్ధి కోసం నూతన భవన నిర్మాణం మరియు అదనపు జిల్లా కోర్టు రావడానికి విశేష కృషి చేసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సామల రామిరెడ్డికి హుజూర్నగర్ న్యాయవాదులు ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు.