హైదరాబాద్ కేకే మీడియా జూన్ 29
టమాట ధరలు కొండెక్కాయ్ ఇప్పటికే టమాటా ధర సాధారణ మార్కెట్లో సెంచరీ దాటిపోయింది. ఒక్క టమాటానే కాదు అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుడు కొనలేనంత స్థాయికి పెరిగిపోయిన టమాటా ధరలతో ఇటు వ్యాపారులు అటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పాటు రోజు వాడుకునే వండుకునే కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కూరలు వండుకోవడం మానేసిన కుటుంబాలు ఎన్నో. ఎండాకాలం సీజన్లో సాధారణంగా రేట్లు పెరుగుతాయి కానీ ఈ ఎండాకాలం మాత్రం విపరీతంగా రేట్లు పెరగడం రైతులకు అవగాహన కల్పించే కూరగాయల సాగుపై దృష్టి మరల్చక పోవడమే పెద్ద సమస్య.. చంపేశారు ఇలాంటి విపత్తుల జరగకుండా ఉండేందుకు కేవలం వరినే పంటగా భావిస్తూ వ్యవసాయం చేస్తున్న రైతుల కు లాభసాటిగా ఉండే ప్రజలకు ఉపయోగపడే అందుబాటు ధరలకు అనుకూలంగా ఉండే లా రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సాహకాలు అందించి ఇలాంటి పంటలపై శ్రద్ధ వహిస్తే ఇలాంటి అవాంతరాలు జరగకుండా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు