కేకే టీవీ సూర్యాపేట
సూర్యాపేట లో కారు హవా
దూసుకెళ్తున్న గులాబీ దళం
జనంలోనే బీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి వలసల వెల్లువ
43 వ వార్డ్ లో బిజేపి కి గుడ్ బై చెప్పి మూకుమ్మడిగా బీఆర్ ఎస్ లో చేరిన శేషగానీ నరేష్ గౌడ్ తో పాటు 320 మంది అనుచరులు
తాజాగాఆత్మకూర్ ,సూర్యాపేట మండలాల్లో జోరుగా చేరికలు
సూర్యాపేట
బీఆర్‌ఎస్ హవా కొనసాగుతున్నది. సూర్యాపేట నియోజకవర్గంలో కారు దూకుడుమీదున్నది. బీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తుండగా, గులాబీ దళం ఊరూర, వాడ వాడ ల కలియదిరుగుతున్నది.
జనంతో మమేకమవుతూ ముందుకుసాగుతుండగా, అటు పదేండ్ల ప్రగతిని చూసి పార్టీలోకి వివిధ పార్టీల నుంచి వలసల వెల్లువ కొనసాగుతున్నది. వివిధ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, కారుకే జైకొడుతుండగా, పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తున్నది. తాజాగా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్ పహాడ్ కు చెందిన బీజేపీ నాయకులు లక్ష్మణ్, లింగ రాజు, ఎల్లయ్య, ఏడు కొండలు, సాయి కృష్ణ, మధుసూదన్ ల తో పాటు గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు బీఆర్ఎస్గత రాత్రి సూర్యాపేట లోని 43 వ వార్డ్ కు చెందిన భాజపా నాయకులు శేశగాని నరేష్ గౌడ్ తన 300 మాంది అనుచరులతో కలిసి భారసా లో చేరారు.