కేకే మీడియా పాలక వీడు నవంబర్ 22
సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బాదే నర్సయ్య పాలకవీడు మండలంలో విస్తృత ప్రచారం
పాలకవీడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు పర్యటించిన హుజూర్నగర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బాదే నరసయ్య కొబ్బరి చెట్ల గుర్తుకు ఓటెయ్యండి అని ఆట మాట ద్వారా తాను ప్రతి గ్రామంలో గవర్నమెంట్ పాఠశాలను గురుకుల పాఠశాలగా ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో హాస్పటల్ పెట్టాలని ,ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని మిగిలిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ,ఉపాధి హామీ కూలి 500 ఇవ్వాలని ,ఉద్యోగస్తులని 55 సంవత్సరాలకి చేయాలని కొంత మందికి నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయలు వేతనాలు ఇస్తున్నారు వాటిని తగ్గించి 1,50,000 వేతనాలు ఇవ్వాలని, ఎమ్మెల్యే ,ఎంపీలకు లక్షల కొలది వేతనాలు ఇస్తున్నారు వారు ఆదర్శంగా వేతనాలు లేకుండా పనిచేయాలని ,ఈ ప్రాంతంలో సిమెంటు ఫ్యాక్టరీలలో స్థానికులకు 70 శాతం కొలువులు కల్పించాలి కానీ 10% కూడా లేరు ఉన్నవాళ్లు కూడా రాళ్లు కొట్టే కాడ బస్తాలు మోసే కాడ పనిచేస్తున్నారు .నన్ను గెలిపిస్తే 70/-శాతం ఉద్యోగాలు ఫ్యాక్టరీలలో కల్పిస్తాను .డీజిల్ పెట్రోల్ ధరలు 35 రూపాయలకే అయేట్టు పోరాటం చేస్తానని రిటైర్మెంట్ అయిన వాళ్ళని కొలువుల్లో పెట్టవద్దని రైతులకు గిట్టుబాటు ధర 3000 రూపాయలు వచ్చేటట్టుగా నేను పోరాటం చేస్తానని, పత్తి ధర గిట్టుబాటు ధర కోసం పోరాడుతానని, రైతుబంధు ఐదు ఎకరాల లోపు ఐదు సెంటున్న 50 వేల కోసం పోరాడతారని ,నిరంతరం ప్రజలకు సేవ చేస్తానని ప్రజల పక్షాన నిలుచొని పోరాడుతానని అలుపెరగని పోరాట యోధుడిగా మడమ తిప్పనని, నేనొక సమిత నవుతానని నా గుర్తు కొబ్బరి చెట్లకు ఓటేసి నన్ను గెలిపించాలని ప్రజలను కోరుతూ విస్తృతంగా పలు గ్రామాలు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.