హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 30:
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థుల ప్రకటన చేసి ప్రతిపక్షాలకు సవాల్ విసిరిది
కేవలం కొన్ని మార్పుల తో 105 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో మార్పులు చేసిన స్థానాల్లో ముఖ్యమైన ములుగు నియోజకవర్గo గట్టి పట్టుండి వరుస విజయాలతో దూసుకుపోతూ మరోసారి విజయాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో ఉన్న సీతక్క అందరికీ సుపరిచితమే. రానున్న ఎన్నికల్లో విజయం సునాయాసమే అని ధీమాగా ఉన్న కాంగ్రెస్ నియోజకవర్గాల్లో ములుగు స్థానం ఒకటి అలాంటి స్థానంలో ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ములుగు జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి కు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో రాజకీయాల్లో చర్చ మొదలైంది.
ఎక్కువ శాతం ఆదివాసి ప్రాంతమున్న ములుగు నియోజకవర్గంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన నియోజకవర్గంలో గతం నుంచి సీతక్కకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు సాక్షాత్
అసెంబ్లీ బడిలోకి దిగుతున్న అధికార బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి మావోయిస్టు పార్టీ అగ్ర నేతలైన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ అన్న బడే రాజేశ్వరి ఆలియాస్ నిర్మలక్కల సంతానమే బడే నాగజ్యోతి. అధికార పార్టీ అభ్యర్థిగా నిలబడుతుండడంతో గతంలో మద్దతిచ్చిన మావోయిస్టు నేతలు వారి ఆధీనంలో ఉన్న ఆదివాసి గ్రామాల సభ్యులు తిరిగి సీతక్కకు మద్దతిస్తారో లేక నాగజ్యోతికి మద్దతు తెలుపుతారు అన్న అనుమానాలు మొదలయ్యాయి.
టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పూర్తి ఆధ్యాత్మిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారిని అందరికీ తెలుసు అయితే అతను నియమించుకున్న జ్యోతిష్యా పండితులు చెప్పిన సందేశం మేరకే అభ్యర్థుల జాబితా చదివే క్రమంలో మొదటి పేరుగా ములుగు నియోజకవర్గ నుండి నాగజ్యోతి పేరును ప్రకటించినట్లుగా వార్తలు విన వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ములుగు నియోజకవర్గంలో సీతక్క గెలుపు అంత సునాయాసం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకాలం చిట్టచివరి గ్రామం వరకు వెళ్లి సేవ చేస్తూ తన శైలిలో రాజకీయం చేస్తున్న ములుగు సీతక్క రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ స్థానం సంపాదించుకొని ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు రేవంత్కు అత్యంత సన్నిహితురాలిగా నమ్మిన వ్యక్తిగా ఉండి భవిష్యత్తు రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకునే తరుణంలో ములుగు నియోజకవర్గ ప్రజలు ఏ రకమైన తీర్పు అందిస్తారో వేచి చూడాలి మరి.