నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 4
నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లో బుధవారం 24 ఎక్సైజ్ యాక్ట్ కేసులలో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మ నాయక్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఐడి మద్యం 18 లీటర్లు, ఐఎం ఎఫ్ ఎల్ మద్యం 27 లీటర్లు,బీర్లు 87 లీటర్లు, మొత్తం వీటి విలువ రూ. 71,700 లు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. నాగార్జున రెడ్డి, నేరేడుచర్ల ఎస్సై ఎ. రవీందర్ నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.