కేకే మీడియా నేరేడుచర్ల ఆగస్టు 29
నేరేడుచర్ల మండలం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఉత్తమ్ పద్మావతి నగర్ లోని గుడిసెలలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాల వద్దకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యాధికారి డాక్టర్ నాగిని ఆధ్వర్యంలో గురువారం సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చర్యలు తీసుకోవాలనికోరారు. జ్వరము, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ అవగాహన సదస్సులో హెల్త్ అసిస్టెంట్ నరసయ్య, ఏఎన్ఎం రేణుక, ఆశ వర్కర్లు తులసి, రజిత,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ హుజూర్నగర్ కన్వీనర్ వాస పల్లయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్,పి వై ఎల్ జిల్లా నాయకుడు వాస కరుణాకర్, పి డి ఎస్ యు నియోజకవర్గ కన్వీనర్ వినయ్, మరియమ్మ సత్తెమ్మ, మాలాంబి, ఫాతిమా మల్లేశ్వరి, వెంకటేశ్వర్లు, ఖాసిం, విజయ్, అనురాధ, సైదులు తదితరులుపాల్గొన్నారు.