సిఎం ప్రోగ్రాం సందర్బంగా ముందస్తు చర్యలు
డిసెంబర్ 04న ముఖ్యమంత్రి కార్యక్రమంలో గ్రూప్-4తో పాటుగా వివిధ పరీక్షల ద్వారా రిక్రూట్ అయిన 9వేల మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రలను అందజేయనున్నారు. దానిలో భాగంగా పెద్ద కల్వలలో సీఎం సభ ఏర్పాట్లకు సంబందించి రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి సభ వేదిక ప్రాంతం.
స్టేజ్ ఏర్పాటు, హెలిప్యాడ్, వీఐపీ, జనరల్ పార్కింగ్ స్థలాలు, ఎక్కడ ఎక్కడా బ్యారికేటింగ్ ఏర్పాట్లు, ప్రజలు సభకు వచ్చే మార్గాలను సందర్శించి, పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే వాహనాలకు, ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పర్యటన సజావుగా సాగేలా కట్టుదిట్టమైన ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులతో పోలీస్ కమిషనర్ చర్చించి పోలీస్ అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఎస్ఐ లక్ష్మణ్ రావు, మల్లేష్ లు పాల్గొన్నారు.