సిపిఐ లో పలువురి చేరిక
సూర్యాపేట జిల్లానేరేడుచర్ కేకే టీవీ డిసెంబర్ 27
నేరేడుచర్ల పట్టణ, పరిసర గ్రామాలకు చెందిన పది కుటుంబాల వారు వివిధ పార్టీలకు రాజీనామా చేసి బుధవారం సిపిఐ పార్టీలోకి లోకి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ సమక్షంలో చేరినట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు తెలిపారు.
పార్టీలో చేరిన వారికి సిపిఐ కండువాలు కప్పిన అనంతరం గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ
ప్రపంచంలోమానవ మనుగడ ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ బ్రతికే ఉంటుందని, అస్తిత్వ పోరాటాలు వేదికగా ప్రజా సమస్యలే ఎజెండాగా నిరంతరం సిపిఐ పార్టీ ఉద్యమస్తుం దని ఆయన అన్నారు. పార్టీలోకి కార్మిక నాయకుడు ముత్యాల భాస్కర్,తిప్పన రామ్ రెడ్డి,గంగయ్య, ఉల్లెందుల దుర్గయ్య,శీలం సుధీర్,రెడ్డిపల్లి వినయ్, రెడ్డిపల్లి కృష్ణ తదితరులు చేరారు.
కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి యల్లబోయిన సింహాద్రి, పట్టణ సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. లక్ష్మి,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, ఏఐటియుసి మండల అధ్యక్షుడు ఊదరవెంకన్న ఏఐటీయూసీ మండల కార్యదర్శి అయిల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.