సిపిఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
దేశ రైతు శుభకరణ్ సింగ్ కు జోహార్లు
వ్యవసాయ కార్మిక సంఘం నేత ధనుంజయ నాయుడు నివాళి
కేకే మీడియా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల
దేశ రాజధాని ఢిల్లీలో శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వ కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు తెలంగాణ రాష్ట్ర సంఘం నేరేడుచర్ల మండల అధ్యక్షుడు కత్తి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు
నిన్నటి రోజున ఖానౌరి సరిహద్దు సమీపంలో జరుగుతున్న రైతుల శాంతి నిరసనలో 24 సంవత్సరాల రైతు శుభ కరణసింగ్ మృతికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని, హర్యానా పోలీసుల రబ్బర్ బుల్లెట్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శుభకరణ్ సింగ్ పాటియాలోని రాజేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, *ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ హత్య అని ఆయన అన్నారు*
ఇప్పటివరకు ఆందోళన చేస్తున్న వారిలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారని మాది రైతు అనుకూల ప్రభుత్వం చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ రైతులను హత్య చేయడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు
కాల్పులు చేయించింది మోడీ ప్రభుత్వం అని కాల్పులు చేసింది హర్యానా సర్కారు అని కాల్పులు జరిపింది పంజాబ్ రైతాంగం మీద అని ఇంకెంతమంది రైతులను నరేంద్ర మోడీ పొట్టన పెట్టుకుంటారని ఆయన ప్రశ్నించారు
గతంలో మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దేశ రైతాంగం తమ న్యాయమైన డిమాండ్ల కొరకు ఆందోళన చేస్తుంటే వారిపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి అని, దేశ రైతు అన్న దాతలను కేంద్ర ప్రభుత్వ ఇప్పటికే వందలాదిమందిని పొట్టన పెట్టుకున్నదని, ఓట్ల కోసం దొంగ పూజలు దొంగ మౌనవ్రతాలు చేస్తున్న నరేంద్ర మోడీ రైతులు వ్యవసాయ కార్మికులు గుర్తించాలని రైతుల చేతులకు బేడీలు వేసిన కేసిఆర్ ప్రభుత్వం శంకరగిరి మా న్యాలు పట్టిందని…. రేపు బిజెపికి దాని మిత్రపక్షాలకు కూడా ఇదే గతి పట్టనున్నదని వారు హెచ్చరించారు
కార్యక్రమం లో మండల సిపిఐ కార్యదర్శి యల్లబోయిన సింహాద్రి, వ్య. కా. సం. జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ A లక్ష్మి, A I Y F జిల్లా అధ్యక్షులు చిలకరాజు శ్రీను, A I T U C మండలఅధ్యక్షులు ఊదర వెంకన్న, రైతు సంఘం నాయకులు అంబటి బిక్షం A I S F నాయకులు కొమర్రాజు వెంకట్, గుడిపాటి శ్రీహరి, పతాన్ హుస్సేన్, ఫాతిమ బేగం పాల్గొన్నారు