Wednesday, December 11, 2024
HomeUncategorizedసామాన్యునిపై జియోమార్ట్ పిడుగు

సామాన్యునిపై జియోమార్ట్ పిడుగు

లబో దిబో అంటున్న చిన్న వ్యాపారులు…

ఇలాగే కొనసాగితే ఇక మా పని అయిపోయినట్లె…

నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 7:

ఒకప్పుడు నేరేడుచర్ల లో చిన్న పెద్ద వ్యాపారులంతా వారి స్థాయిలో వ్యాపారాలు నడిచి సంతోషంగా ఉండే పరిస్థితులు కరోనా మహమ్మారి తర్వాత కొంచెం కొంచెం గా తగ్గుతూ వస్తున్న వ్యాపారాలు నేడు జియో స్మార్ట్ బజార్ ఏర్పాటుతో ఒక్కసారిగా పడిపోయాయి.
రిలయన్స్ మన దగ్గరికా వస్తదా అంత లేదులే అనుకున్న వాళ్ళందరూ ఊహించని విధంగా ప్రారంభోత్సవం కావడంతో నేరేడుచర్ల తో పాటు గరిడేపల్లి పాలకీడు మండలాల ప్రజల కొనుగోళ్లతో కిటకిటలాడుతూ ఒక్కసారిగా మార్కెట్ను షేక్ చేయడంతో చిన్నాచితక వ్యాపారులు లబో దిభో అంటున్నారు.
ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని సంతోషంగా కొంత ఆదాయాన్ని సమకూర్చుకొని ఖర్చులు పోను కొద్దో గొప్పో డబ్బు ఆదా చేసుకునే రోజులనుంచి కరోనా అనంతరం తగ్గిన వ్యాపారాలతో ఆన్లైన్ మార్కెట్ మోతతో వ్యాపారాలు తగ్గినా ఫర్వాలేదులే అన్న తీరులో జరుగుతున్న వ్యాపారానికి రిలయన్స్ నేరేడుచర్ల మార్కెట్లోకి రావడం కిరాణా సరుకుల మొదలు పాలు, పండ్లు, కూరగాయలు, జనరల్ స్టోర్స్ , బియ్యం , కూల్ డ్రింక్స్, బేకరీ వ్యాపారులపై ఎక్కువ ప్రభావం పడటంతో ఒక్కో రోజు కనీసం బోనీ కూడా కానీ పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో భవిష్యత్తు ఎట్లా అన్న ఆందోళనలో పడ్డారు.
సొంత మడిగలు ఉన్నవారు వ్యాపారం అరా కొర నడిచిన పరవాలేదు కానీ దుకాణాలు బాడుగలకు తీసుకుని వ్యాపారం చేసే వ్యాపారస్తులు మాత్రం కిరాయి ఎట్లా చెల్లించాలి, కుటుంబం ఎట్లా గడవాలి, అప్పులు ఎట్లా తీరాలే, మా, మా పిల్లల భవిష్యత్తు ఏమిటన్న ఆందోళనలో పడ్డారు.
20 ఏళ్ల క్రితమే కమ్యూనిస్టులు కార్పోరేట్ కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసి కార్పొరేట్ రాకతో సామాన్య వ్యాపారుల భవిష్యత్తు అంధకారంలోకి మారుతుందని హెచ్చరించిన పెద్దగా పట్టించుకోని, కనీసం మద్దతు తెలపని , ఒకప్పుడు వారిపైనే విమర్శలు కుప్పించిన సదరు వ్యాపారులు ఆనాడే చెప్పిన మాట వినకపోవడం మన తప్పే అని ప్రస్తుతం మాకు ఉన్న అంధకార భవిష్యత్తుకు ఎవరో ఒకరు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాధేయ పడుతున్నారు.
ప్రస్తుత ప్రపంచీకరణలో ఒక్క వ్యాపారంతో మొదలై అన్ని రకాల వ్యాపారాలు ఒక్కటొక్కటిగా నేరేడుచర్లకు వచ్చి చేరుతాయన్న భయాందోళన ఒకవైపు ఉన్న , ఇప్పుడున్న జియో మోజు కొన్నాళ్లకే పరిమితం అవుతోందిలే అనుకొని ఆశతో కొందరు వ్యాపారులు ఉన్న రోజురోజుకు ప్రజల ఆలోచన విధానం మారడం అన్ని సమకూరే, మార్కెట్లో చిన్న వ్యాపారులు ఇవ్వలేని ధర కంటే తక్కువ ధరకే, నాణ్యతతో వస్తువులు అందిస్తుండడం జియో మార్ట్ లాంటి వ్యాపార సంస్థలు ఆకర్షిస్తూ వస్తున్నాయి.
చాలాకాలంగా వ్యాపారం చేసిన వారు నాలుగు రాళ్లు వెనకేసుకుని నడిచినా నడవకుండా పరవాలేదు అనుకునే వాళ్ళు ఉన్నప్పటికీ చదువుకొని నిరుద్యోగిగా ఉద్యోగాలు లేక చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకొని జీవితాలు మొదలుపెట్టిన వ్యాపారులు ఈ వ్యాపారాలు నడవకుంటే ఇటు వ్యాపారం లేక మరోవైపు వెళ్లలేక ఉద్యోగాలు చేయలేక కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉంది.

బేకరీ వ్యాపారి ఎస్కే సిలార్

స్మార్ట్ బజార్ పడడం వల్ల బిస్కెట్లు చాక్లెట్లు కూల్ డ్రింక్స్ బన్ను ఐస్ క్రీమ్ వ్యాపారం మొత్తం పడిపోయింది కిరాయిలు కట్టే పరిస్థితి కుడ లేదు వ్యాపారం భారంగా ఉంది

కూరగాయల వ్యాపారి సరిత
స్మార్ట్ బజార్ పడడం వల్లమకు వ్యాపారం దెబ్బ తిన్నది ఇంతకుముదు మాకు వ్యాపారం బాగుంది ఇప్పుడు షాప్ నడవడం కష్టంగా ఉంది ఇలాగే కొనసాగితే ఇల్లు కూడా గడవడం ఇబ్బందిగా మారి పరిస్థితి మా పిల్లల్ని చదివించుకోవాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది

కిరాణా జనరల్ వ్యాపారి లక్ష్మీ నరసింహారావు దర్శించర్ల

పల్లెటూరికి పాకిన స్మార్ట్ బజారు గాలి నేరేడుచర్ల పక్కనే ఉండడంతో అందరూ స్మార్ట్ బజార్ కే వెళ్తున్నారు మాకు బేరం తగ్గినది ఇలానే కొనసాగితే షాపు బంద్ చేసి వేరే పని వెతుక్కోవాల్సి వస్తుంది

పండ్ల వ్యాపారి షేక్ బాషా

స్మార్ట్ బజార్ పడడం వల్ల జీవన ఉపాధి కోల్పోయిన ఇలానే కొనసాగితే కార్పొరేట్ కంపెనీలు వ్యాపారులతో చిన్న వ్యాపారాలు జీవనాధారం కోల్పోతున్నారు

జనరల్ స్టోర్ వ్యాపారి బుడిగే వెంకన్న
స్మార్ట్ బజార్ వల్ల జనరల్ స్టోర్ గిరాకీ తగ్గింది ఇంత ముందు కొద్దిగా బేరం ఉండేది ఇప్పుడు స్మార్ట్ బజార్ రావడంతో మొత్తం దాంట్లోనే జనరల్ స్టోర్ కొనవలసిన వస్తువులు స్మార్ట్ బజార్లో నే కొంటున్నారు

కంది బండ హరిప్రసాద్ కూల్ డ్రింక్స్ వ్యాపారి

చిన్న వ్యాపారాలు చితికి పోతున్నాయి వర్కర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఇలానే కొనసాగితే వ్యాపారం మూసుకో వాల్సి వస్తుంది

కిరాణా షాపు వ్యాపారి శ్రీను
ఇలాంటి స్మార్ట్ బజార్లు వెలిసి చిన్న వ్యాపారాలని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి చిన్న వ్యాపారాలు చితికి పోతున్నాయి కిరాయిలు కరెంటు బిల్లు ప్రతి నెల భారమైపోతుంది ఇలానే కొనసాగితే చిన్న వ్యాపారాలు అప్పుల పాలై వ్యాపారాలు దివాలా తీసి మూసివేసే పరిస్థితి వస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments