హైదరాబాద్ కేకే మీడియా ఆగస్టు 25
తెలంగాణ రాష్ట్రం హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది సాముల రామిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా నియామకం చేసింది.
నూతన పాలకమండలి ఏర్పాటు కోసం కొన్ని రోజుల క్రితం పాలకమండలి అధ్యక్షులుగా భూమన కరుణాకర్ రెడ్డిని ప్రకటించినప్పటికీ పాలకమండలి సభ్యులుగా వివిధ రాష్ట్రాల నుంచి శుక్రవారం నాడు 24 మంది సభ్యులకు చోటు కల్పించగా తెలంగాణ రాష్ట్రం నుంచి సామల రాంరెడ్డికి అవకాశం లభించింది.
సుదీర్ఘకాలం నుండి హుజూర్నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా హైకోర్టు న్యాయవాదిగా హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయ నేపథ్యం కలిగి ఉండి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ తన వద్దకు సమస్యలతో వచ్చిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ గతం నుండి వైయస్ కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి గత పాలకమండలిలో చోటు దక్కినప్పటికీ అనివార్య కారణాలతో పాలకమండలి కుదించడంతో అవకాశం కోల్పోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రముఖులచే వైయస్ కుటుంబ సన్నిహితునిగా మెలుగుతూ నేడు అరుదైన గౌరవంగా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడుగా ఎన్నిక కావడంతో అభిమానులు సన్నిహితులు మిత్రులు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు.
తన నియామకం పట్ల సహకారం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు
సాముల రామిరెడ్డికి దక్కిన అరుదైన గౌరవం
RELATED ARTICLES