నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 28
సాగరాయకట్టులో ఎడమ కాలువ కింద ఉన్న రైతులకు సాగునీరు త్రాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు ధర్నా నిర్వహించారు.
సోమవారం నాడు నేరేడుచర్ల ప్రధాన కూడలి వద్ద మండలంలోని మేడారం ఫతేపురం వైకుంటపురం జానలదిన్నె తదితర గ్రామాల రైతులు వర్షా బావ ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో వేసిన ఆరుతడి పంటలు పొలాలు ఎండిపోతుండటం, త్రాగునీరు లేకుండా జలాశయాలు అడుగంటి ఇబ్బందులు పడుతున్నామని కనీసం వారబందీ ప్రకారమైన సాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు
గతంలో 485 అడుగులు సాగర్ నీరు ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం పంపింగ్ పద్ధతిలో నీటిని ఇచ్చి ఆదుకున్నారని ప్రస్తుతం 522 అడుగులు ఉన్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సమస్యను గుర్తించి వెంటనే నీటి విడుదలకు అధికారులు నాయకులు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.