నాగార్జున సాగర్ కేకే మీడియా ఆగస్ట్ 29 :
నల్లగొండ జిల్లాలో బహుళార్థక సాధక ప్రాజెక్ట్ కు బుధవారం మరోసారి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి డ్యామ్ దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యామ్ కు ఇంఫ్లో 1,78, 983 కాగా డ్యామ్ నీటి నిల్వ 312 అడుగులు కాగా అంతే స్థాయిలో నీరు నిల్వ వుంది. డ్యామ్ గేట్లు ఎత్తడం ఈ సీజన్ లో ఇది రెండో సారి.